ఏం తినాలి? సాధ్యమైనంతవరకూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభించే పదార్థాలనే ఆహారంలోకి తీసుకోవాలి. లేదంటే కొవ్వు నిల్వలు ఎక్కువై ఆరోగ్య సమస్యలు చుట్టు ముడతాయి.
పొద్దుటి పూట తీసుకునే అల్పాహారంలో తృణ ధాన్యాలు, వేరు శెనగలు, బ్రెడ్ వంటి తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న పదార్థాలు మాత్రమే ఉండాలి. శరీరానికి పైబర్, ప్రొటీన్‌లు వీటి ద్వారానే అందుతాయి. అంతేకాకుండా రోజంతా శరీరానికి ఇవి శక్తిని ఇస్తాయి కూడా.
కొవ్వు అధికంగా ఉన్న స్వీట్స్, జంక్ ఫుడ్స్, చికెన్ టిక్కా లాంటి పదార్ధాలను తరచూ తీసుకోకూడదు. వీలైనంత వరకూ ఇలాంటి వాటిని పక్కన పెడితేనే మంచిది.
మొక్కజొన్న, టమోటా, గుమ్మడి, క్యాలిఫ్లవర్, క్యారెట్లను ఆవిరిపై ఉడికించి తినాలి. ఇవి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. అలాగే జామపండు, పుచ్చకాయ బొప్పాయి, ద్రాక్ష పండ్లలోని గుణాలు క్యాన్సర్ కారకాలను ఎదుర్కోవడమే కాక, గుండెకు రక్షణ ఇస్తాయి.
అలాగే, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల్లో లభించే సల్ఫర్ జీర్ణాశయం మరియు పెద్దపేగులకు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. పాలకూర, క్యారెట్, ఇతర ఆకుకూరల నుంచి ఎ- విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
సాయంత్రం వేళల్లో కొబ్బరి నీరు, బార్లీ నీళ్లు, తాజా పండ్లు, కూరగాయల సలాడ్స్, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్‌లు సమృద్ధిగా లభిస్తాయి. |