క్రూసిఫెరా కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లాంటి వాటిలో ఐసోసయనేట్స్ అనే రసాయనాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే, వీటిని ఎక్కువగా ఉడికిస్తే మాత్రం అందులో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు నశించిపోయే ప్రమాదం ఉంది.
అందుకనే క్యాబేజీలను సలాడ్‌గా గానీ, ఆవిరితోగానీ ఉడికించి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అయితే పొగత్రాగని వారైనా, మహిళలైనా జన్యు పదార్థాలను బట్టి వీటి ప్రభావం ఉంటుందని గమనించాలి. ఇదిలా ఉంటే... క్యాబేజీ తినడం వల్ల క్యాన్సర్ బారినుండి తప్పించుకోవచ్చన్న అంశంపై ఇంకా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి.
సాధారణంగా రోజుకు ఐదు లేదా ఆరు రకాల కూరగాయలను తప్పనిసరిగా తీసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుందని ఎన్నో రకాల పరిశోధనలు రుజువు చేశాయి. అంతేగాకుండా... పండ్లు, కూరగాయల ద్వారా కూడా, చాల రకాల వ్యాధులను దగ్గరకు రానీయకుండా చేయవచ్చని క్యాబేజీ కథ వింటే అర్థమైంది కదూ...! |