ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఆహారం > మేధోశక్తిని పెంచే ఆహారపు అలవాట్లు...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మేధోశక్తిని పెంచే ఆహారపు అలవాట్లు...!
అలాగే... మధ్యాహ్న భోజనంలో కోడిగ్రుడ్లను ప్రతిరోజూ తీసుకుంటే చాలామంచిది. కోడిగుడ్డు నుండి మన శరీరం స్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ను తయారు చేసుకుంటుంది. ఎసెటిల్కోలైన్ దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది గనుక శరీరంలో లోపిస్తే ఆల్జిమర్స్ వ్యాధి వస్తుంది.

అంతేగాకుండా న్యూరో ట్రాన్స్‌మీటర్స్ మన మేధో శక్తిని పెంచుతాయి. మెదడును ఉత్తేజపూరితం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పళ్ళు, పచ్చటి కూరలే శరీరాని మిత్రులనే విషయాన్ని ఎన్నడూ మరచిపోవద్దు. వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉండటమే గాకుండా, పైబర్ అత్యధిక స్థాయిలో ఉంటుంది.

అలాగే, పెరుగును కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే అమినో యాసిడ్లు ఒత్తిడిని తట్టుకునేందుకు దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి. అంతేగాకుండా, న్యూరో ట్రాన్స్‌మీటర్లను ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. పెరుగు మెదడుకే కాక, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీర్ణకోశాన్ని చక్కగా పనిచేసేలా చేస్తుంది.

సన్నబడాలన్న నెపంతో పూర్తిగా ఆహారపదార్థాలకు దూరంగా పస్తులుంటుండేవారు కూడా పై విషయాలను గుర్తుంచుకోవాలి. అలా చేయడం వల్ల సన్నబడటమేమేగానీ అనారోగ్యం పాలవడం మాత్రం ఖాయం. జీవితంలో చురుకుగా ఉంటూ మంచి విజయాలను సొంతం చేసుకోవాలంటే మేధోశక్తి చాలా అవసరం. అలాంటి మేధోశక్తి పైన చెప్పిన ఆహార జాగ్రత్తలను, నియమాలను పాటించడం వల్ల పొందవచ్చు.
<< 1 | 2 
మరిన్ని
క్యాబేజీతో క్యాన్సర్‌కు బై...బై...!
ఆహారం నిద్ర వ్యాయామం కరువైతే....
కడుపు మాడ్చుకుంటే ఒళ్లు తగ్గుతుందా?
పళ్లరసం ఇష్టమా... మధుమేహం తప్పదు...
మునగ అంటేనే మూతి ముడుచుకుంటే నష్టం..
చర్మ సౌందర్యానికి దివ్యౌషధం ద్రాక్ష