అధిక ఒత్తిడి వల్ల మన శరీరంలో హోమోస్టైన్ నిల్వలు పెరగడం వల్లనే గుండెపోటు సంభవిస్తుంది. కనుక రోజులో ఒక కప్పు పప్పు గింజలను తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం నుండి బైటపడవచ్చు.
ఇక టీలో కూడా మన శరీరానికి అవసరమైన చాలా రకాల యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి. యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డామేజీ లేకుండా చేస్తాయి. టీ తాగడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అయితే రోజుకు కనీసం నాలుగు కప్పుల టీ మాత్రమే తీసుకోవాలి. పంచదార, పాలు లేకుండా, ఒట్టి టీఆకుతో, బాగా మరగనివ్వకుండా వేడిచేసిన టీ తీసుకుంటే మరీ మంచిది. టీలో గ్రీన్ టీ అన్నింటికన్నా ఆరోగ్యానికి శ్రేష్టకరం.
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సోయా, చేపల గురించే...! సోయా పాలు, సోయా చీజ్, సోయా నట్స్, సోయా పిండి ఇలా ఏదో ఒకదాన్ని ప్రతిరోజూ ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల మహిళల గుండె పదికాలాలపాటు చల్లగా ఉంటుంది. సోయా కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. అంతేగాక రక్తప్రసరణ సక్రమంగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ నివారిణిగా, పనిచేసే సోయా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచిది.
కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండే చేపలలో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం మూలాన ఇది గుండెకు మేలు చేస్తుంది. చేపలు రక్తనాళాలని కోలెన్‌గా ఉంచటమే గాకుండా, శరీరంలో మంచి కొవ్వు శాతాన్ని పెంచుతాయి. వారానికి రెండుసార్లు చేపలను ఆహారంలో తీసుకోవడం ఉత్తమం. |