ప్రస్తుతం మహిళలను వేధిస్తోన్న సమస్య ఎనీమియా (రక్తహీనత). లేచింది మొదలు గొడ్డు చాకిరీ చేసే మహిళలకు రోజంతా... పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయమెక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ... ఏం తింటాలే... అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత. | విటమిన్ బి12 తప్పనిసరి..! |
| | తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది... |
| |
అంతేగాకుండా వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం వల్ల, రుతుసమయంలో అధిక రక్తస్రావం వల్ల, ఫైల్స్ సమస్య వల్ల కూడా రక్తహీనత వస్తుంది. దీనివల్ల రక్తంలో ఎర్రకణాల సంఖ్య తగ్గిపోయి శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా ఒంట్లో నీరసంగా ఉండటం, కళ్ళు తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తలనొప్పి తదితర సమస్యలు కలుగుతాయి.
మరి దీనికి పరిష్కారమే లేదా..? అంటే ఉందని చెప్పాలి. అదేంటంటే... మందులకన్నా... ప్రతిరోజూ వీరు తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా లభించే వాటినే తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా కాయగూరలు, పండ్లలో ఉంటుంది.
|