ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఆహారం > మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...!
తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే... ముడి గోధుమలు, ఎర్ర బియ్యం, సోయాబీన్స్, తేనె లాంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. మాంచి బలవర్థకమైన ఆహారం తీసుకోవడంతో పాటుగా... రోజుకు కనీసం రెండు సిట్రస్ ఫలాలను అయినా క్రమం తప్పకుండా తీసుకోవాలి.

అంతేగాకుండా బీట్‌రూట్ రసాన్ని తీసుకున్నట్లయితే... రక్తహీనత సమస్య నుండి చాలా త్వరగా బయటపడవచ్చు. బీట్‌రూట్ రక్తంలో ఉండే ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచటమే గాకుండా... శరీరానికి కావలసిన తాజా ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. కాబట్టి చాలామంది ఎదుర్కుంటున్న ఈ రక్తహీనత సమస్యను అధిగమించేందుకు పై సూచనలను తప్పకుండా పాటిస్తారు కదూ...!
<< 1 | 2 
మరిన్ని
గుండెను పదిలంగా కాపాడుకోండిలా...!
మేధోశక్తిని పెంచే ఆహారపు అలవాట్లు...!
క్యాబేజీతో క్యాన్సర్‌కు బై...బై...!
ఆహారం నిద్ర వ్యాయామం కరువైతే....
కడుపు మాడ్చుకుంటే ఒళ్లు తగ్గుతుందా?
పళ్లరసం ఇష్టమా... మధుమేహం తప్పదు...