ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఆహారం > పండ్ల రసాలతో ఆరోగ్యం పదిలం...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పండ్ల రసాలతో ఆరోగ్యం పదిలం...!
Shoba
FileFILE
ఎండలో చాలా సేపటి నుంచి పనిమీద తిరిగిన కుసుమ ఈసురోమంటూ అప్పుడే ఇంటికి చేరింది. అబ్బా...! ఏదైనా చల్లగా తాగితే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఫ్రిజ్ ఓపెన్ చేసింది. చూస్తే అందులో ఏమీ లేక పోవడంతో.. గబగబా ఓ నిమ్మకాయను కోసి చక్కెర నీటిలో కలిపి, ఐస్‌క్యూబ్స్ వేసుకుని గటగటా తాగేసింది. కాస్తంత తేరుకున్నాక తిరిగి ఇంటిపనిలో పడింది.

ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేమిటంటే... ఎండనబడి నడిచిన ఎవరికైనా చల్లగా తాగాలని అనిపించడం సహజం. ఆ చల్లటివి పండ్ల రసాలైతే మరీ మంచిది. తాజాగా తీసిన పండ్లరసం తాగటం వల్ల శరీరం సేదతీరటమే గాకుండా... మనసు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా తయారవుతుంది.
క్యాన్సర్ నిరోధకారి ద్రాక్ష..!
  ద్రాక్షరసం మంచి జీర్ణకారి. అంతేకాదు, సన్నగా ఉన్నవారు త్రాగితే ఒంటికి బలం చేకూరుతుంది. ఇది మంచి క్యాన్సర్ నిరోధకారి కాగా, నెలసరి సమస్యలతో బాధపడే మహిళలకు బాగా పనిచేస్తుంది...      


ఎందుకంటే... పండ్లరసాలలో రకరకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎంజైములతో పాటుగా నీరు తదితర ధ్రవపదార్థాలు ఉండటం వల్ల వెంటనే రక్తంలో కలిసిపోయి... శరీరం తక్షణ శక్తిని పుంజుకుంటుంది. అంతేగాకుండా... ఈ పండ్ల రసాలు తాగడం వల్ల శరీరంలోని మలినాలన్నీ తొలగిపోయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

పచ్చికూరగాయల రసం తాగినట్లైయితే శరీరంలో కొత్త కణాలు పుడతాయి. అంతేగాకుండా... శరీరం ముడుతలు పడకుండా, త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. వీటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పళ్ల రసాలు ఏంటంటే...

కేరట్ రసం... ఇందులోని కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, యూరిక్ ఆమ్లాన్ని బయటకు పంపుతుంది. కాలేయ సంబంధ వ్యాధులు, క్షయ, కడుపులో నులిపురుగులున్న వారికి కేరెట్ జ్యూస్ చేసే మేలు అంతా ఇంతా కాదు.
1 | 2  >>  
మరిన్ని
మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...!
గుండెను పదిలంగా కాపాడుకోండిలా...!
మేధోశక్తిని పెంచే ఆహారపు అలవాట్లు...!
క్యాబేజీతో క్యాన్సర్‌కు బై...బై...!
ఆహారం నిద్ర వ్యాయామం కరువైతే....
కడుపు మాడ్చుకుంటే ఒళ్లు తగ్గుతుందా?