బీట్‌రూట్ రసం... జబ్బుపడ్డవారు ఈ రసాన్ని తాగితే త్వరగా కోలుకుంటారు. ముఖ్యంగా కణితులు, వ్రణాలు, పుండ్లతో బాధపడేవారు ఈ జ్యూస్‌ను తాగితే త్వరగా మానిపోతాయి.
బొప్పాయి రసం... బొప్పాయిలోని విటమిన్ ఎ, విటమిన్ సి, ఖనిజ లవణాలు, పీచు పదార్థం పుష్కలంగా ఉండంటం వల్ల అజీర్తిని, రక్తం గడ్డలు కట్టడాన్ని నివారించి శరీరానికి మంచి నిగారింపును కలుగజేస్తుంది. తరచుగా బొప్పాయిరసం తాగితే... ఎసిడిటీ, అజీర్తి, రక్తహీనత, కంటి జబ్బులకు దూరంగా ఉండవచ్చు. బొప్పాయి వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనీయదు.
అల్లం రసం... ఒంటికి నీరు పట్టినవారు, ఆస్తమా, మొలలు, దగ్గు, కామెర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ భోజనానికి ముందు అల్లం రసం తీసుకుంటే మందులు వాడాల్సిన అవసరమే ఉండదు.
ద్రాక్షరసం... ద్రాక్షరసం మంచి జీర్ణకారి. అంతేకాదు, సన్నగా ఉన్నవారు త్రాగితే ఒంటికి బలం చేకూరుతుంది. ఇది మంచి క్యాన్సర్ నిరోధకారి కాగా, నెలసరి సమస్యలతో బాధపడే మహిళలకు బాగా పనిచేస్తుంది.
టమోటా రసం... దీంట్లో పొటాషియం, మెగ్నీషియం, మినరల్స్, విటమిన్ ఎ, పీచుపదార్థం లాంటివి పుష్కలంగా లభిస్తాయి. దీంట్లో చక్కెర శాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి మంచి వరంగా చెప్పుకోవచ్చు. అంతేగాకుండా, గ్యాస్, కాలేయ సంబంధిత వ్యాధులను ఇది నివారిస్తుంది. రోజుకు నాలుగైదు టమోటాలు తింటుంటే బి కాంప్లెక్స్ మాత్రలతో పనే ఉండదంటే అతిశయోక్తి కాదు. |