ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఆహారం > వ్యాయామం పేరు చెప్పి ఎంతైనా లాగించవచ్చా?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వ్యాయామం పేరు చెప్పి ఎంతైనా లాగించవచ్చా?
Raju
WD
వ్యాయామం చేయడం ప్రతి మహిళకూ తప్పనిసరి అవసరమే. కానీ, వ్యాయామం చేస్తున్నామని చెప్పి ఏదిపడితే అది లాగించేద్దాం అంటే మాత్రం ప్రమాదమే అంటున్నారు ఆహార నిపుణులు. గంటల తరబడి వ్యాయామం చేస్తున్నా కాబట్టి కొవ్వు మొత్తం కరిగిపోవడం ఖాయమని భావించడం పొరపాటని వీరు చెబుతున్నారు.

ఎందుకంటే మనం రోజులో వినియోగించే శక్తి కంటే ఎక్కువ కేలరీలను తీసుకుంటూ వస్తే ఎంత వ్యాయామం చేసినా ఫలితముండదు. పైగా మిగిలిన కేలరీలు కొవ్వులా మారడం తథ్యం. ఎందుకంటే జీవన పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో మనం తీసుకుంటున్న ఆహారంలో పోషకాహారం పాలుకు మించి, ఖర్చు కాని పదార్థాలే ఆహారంలో ఎక్కువగా ఉంటున్నాయి.

అందుకే... వ్యాయామం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ తిన్నా నష్టం లేదులే అనుకోవటం సరికాదు. మితంగా తినడం, సాధ్యమైనంత కఠిన శ్రమ చెయ్యడం ఇదే మంచి సూత్రం. మరీ ముఖ్యంగా మహిళలు తీరిక వేళల్లో కారప్పూస, స్వీట్, గింజలు ఇలా ఏదో ఒకటి తినడం అలవాటుగా ఉంటోంది.

భోజనం చేసిన తర్వాత ఇలాంటి చిరుతిళ్ళకు అలవాటు పడ్డారంటే మహిళలు ఎంతగా వ్యాయామం చేసినా వారిలో నిల్వ ఉన్న కొవ్వు పదార్థాలు కరిగే ప్రసక్తే లేదని గుర్తుంచుకుంటే చాలా మంచిది. అందుకని తీసుకున్న ఆహారం మేరకు మించి శారీరక శ్రమ చేస్తున్నామా లేదా అనేది ఎవరికి వారు పరీక్షించుకోవాలి.

మొత్తం మీద పరిశీలిస్తే వ్యాయామం చేస్తున్నాం అని ఎవరూ ఏది పడతే అది లాగించవద్దని ఆహార నిపుణుల సలహా.. పాటిద్దామా...
మరిన్ని
సెలవుల్లో స్లిమ్‌గా తయారవ్వాలంటే....!
పండ్ల రసాలతో ఆరోగ్యం పదిలం...!
మంచి ఆహారంతో ఎనీమియాకు దూరం...!
గుండెను పదిలంగా కాపాడుకోండిలా...!
మేధోశక్తిని పెంచే ఆహారపు అలవాట్లు...!
క్యాబేజీతో క్యాన్సర్‌కు బై...బై...!