ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఆహారం > డాక్టర్ అవసరం లేకుండా చేసే యాపిల్ రసం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
డాక్టర్ అవసరం లేకుండా చేసే యాపిల్ రసం
FileFILE
రోజూ యాపిల్ తీసుకో... డాక్టర్‌ను దూరంగా ఉంచు అని సామెత. అంటే క్రమం తప్పకుండా యాపిల్ తీసుకుంటే అనారోగ్య దరిచేరదని అర్థం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే యాపిల్ పండు అతి పురాతనమైన పళ్ల రకాల్లో ఒకటి. చరిత్రలో పళ్లకోసమే ప్రత్యేకంగా పెంచిన మొట్టమొదటి వృక్షం ఇదే కావడం మరో విశేషం. తొలుత రోమన్లనుంచి ఈ పండు ప్రస్థానం మొదలైంది. తర్వాత ఈ వృక్షాలు బ్రిటన్‌కు, అక్కడినుంచి అమెరికాకు విస్తరించడంతో ఇది ప్రపంచానికి అంతటికీ పరిచయమైంది.

శీతల ప్రాంతంలో మాత్రమే పెరిగే ఈ పండ్ల నుంచి తీసిన రసం చాలా రుచికరంగా ఉంది. వసంత రుతువులో యాపిల్ చెట్లకు పూసే పూలు ఆకురాలు కాలం వచ్చేసరికి పరిపక్వత చెంది తినడానికి ఉపయోగపడే పళ్లుగా మారతాయి. ఈ చెట్టు వాస్తవానికి గులాబీ కుటంబానికి చెందిందంటే బహుశా ఎవరూ నమ్మరు కూడా. యాపిల్ పూలను బాగా పరిశీలించి చూడండి అవి అచ్చంగా గులాబీ పూలలా కనిపిస్తాయి.

యాపిల్ నుంచి రసం మాత్రమే కాకుండా వెనిగర్, పెక్లిన్ తయారు చేస్తారు. వీటినుంచి జామ్ తయారు చేస్తారు. యాపిల్ రసాన్ని పులియబెట్టి కాల్వదాస్ అనే మత్తిచ్చే లిక్కర్, యాపిల్ జాక్ అనే స్పిరిట్ తయారు చేస్తారు. కన్వేయర్ బెల్ట్‌లో యాపిల్స్ అన్నిటినీ శుభ్రంగా కడుగుతారు. మంచివాటిని ఏరి పాడైన, పుచ్చిపోయిన వాటిని తీసేస్తారు. కన్వేయర్ బెల్టు ఈ పళ్లను గుజ్జుగా తయారు చేస్తుంది. ఈ గుజ్జును మాష్ అంటారు. కన్వేయర్ బెల్టులోని సోక్ అని పిలవబడే ఫ్యాబ్రిక్ ట్యూబ్ ద్వారా ఫిల్టర్ అవుతుంది. ఈ రసాన్ని పక్కన ఉన్న పైప్ లోకి పంపుతారు. ఈ రసాన్ని బాగా వేడి చేస్తారు. తర్వాత బాగా చల్లబరుస్తారు. ఈ ప్రక్రియలో బాక్టీరియా పూర్తిగా హరించుకుపోతుంది.

ప్రతి దశలోనూ యాపిల్ రసం రుచి నాణ్యతను పరిశీలిస్తారు. తర్వాత ఈ రసాన్ని ప్లాస్టిక్ బాటిల్స్‌లో నిల్వ చేస్తారు. బాటిల్స్ పరిశుభ్రంగా ఉంచేందుకు వాటిని స్టెరిలైజ్ చేస్తారు. తర్వాత వీటని కన్వేయర్ బెల్ట్ మీదకు పంపుతారు. అక్కడ తాజా రసాన్ని బాటిల్స్‌లో నింపి సీల్ చేస్తారు. ప్లాస్టిక్ క్యాప్ గట్టిగా బిగుసుకుని ఉండేలా మరో యంత్రం చూస్తుంది. తర్వాత క్యాప్‌పై రసాన్ని తయారు చేసిన స్టాంప్ చేస్తారు. బాటిల్స్‌పై ఆకర్షణీయమైన లేబుల్స్ అంటిస్తారు. ప్రతి బాటిల్‌ను ఎలెక్ట్రానిక్‌గా స్కాన్ చేసి లీకేజ్ ఏమీ లేకుండా క్యాప్ గట్టిగా ఉన్నదీ లేనిదీ తనిఖీ చే్స్తారు.

ఇన్ని రకాల ప్రక్రియలను దాటుకున్న తర్వాత మనముందుకు వచ్చేదే ఆపిల్ జ్యూస్. తాగి, ఆస్వాదించేందుకు ఇప్పుడు యాపిల్ రసం మీ ముందు ఉంది. కల్తీలేని పళ్లరసం ఏదంటే యాపిల్ జ్యూస్ అనే చెప్పుకోవాలి. బిపి, సుగర్ వ్యాధుల బారిన పడ్డ వారు సైతం యాపిల్ పండును నిరభ్యంతరంగా తినవచ్చని అన్నారంటే దీనిలో పీచు పదార్ధం ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించుకోవచ్చు. పీచుపదార్ధం కొలెస్ట్రాల్‌ను పూర్తిగా అరికడుతుంది కాబట్టే డాక్టర్‌ అవసరం కూడా లేకుండా చేసే పండుగా దీనికి పేరుంది. మహిళలు సర్వకాలాల్లోనూ నిక్షేపంగా తీసుకోదగిన పళ్ల రసాల్లో యాపిల్‌కే అగ్రస్థానం మరి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దమ్ము కొట్టే యువతులు తాజా ఫ్యాషన్
అన్ని పోషకా పదార్ధాల ప్రతిరూపం చెర్రీ రసం
ప్లాస్టిక్‌పై మోజు ఆరోగ్యానికి తప్పని కీడు
ఉప్పుతో చెలగాటమాడవద్దు...
మహిళల అకాల మరణాలను అరికట్టవచ్చు...
తీపి రసంతో కలకాలం బతకవచ్చు...