సిరిమల్లె పువ్వల్లె నవ్వు… చిన్నారి పాపల్లె నవ్వు.. అంటూ ఎన్ని రకాలుగా బతిమాలుకున్నా నవ్వొచ్చినప్పుడే నవ్వుతారే గాని ఊరకూరకే ఉత్త నవ్వులు ఎవ్వరూ నవ్వరు. 'నవ్వు' అని మనమందరం పిలుచుకునే ఆహ్లాదకరమైన భావం వదనాన్ని వెలిగించాలంటే మనసు సంతోషంగా ఉండాలి.