నేనివ్వాళ మా అమ్మను అడిగాను...ఏంటంటే..! మా నానమ్మ ఇంట్లో అంటే తనకు అత్తగారిల్లు. ఇక్కడ ప్రతి ఒక్కరుకూడా అమ్మనే సలహాలు అడుగుతుంటారు. అది ఎలా సాధ్యం అని? ఇంటిల్లిపాది అమ్మకే ఎక్కువ గౌరవం ఇస్తుంటారు. కాని ఇలా ప్రతి ఇంట్లోనూ నేడు మనం చూడగలుగుతామా...!
దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి...! దీనికి మా అమ్మ చిరునవ్వుతో ఇలా అంది...నువ్వేం కంగారు పడకు. నీకు ఆ రహస్యాలేంటో చెబుతాను. నీవుకూడా మీ అత్తగారింట్లో అందరి చేత గౌరవం స్వీకరించేలా సూచిస్తాను. అత్తగారింట్లో ఎలా మెలగాలో నేను నీకుకూడా నేర్పిస్తాను. అత్తగారింట్లో ఎలా నడుచుకుంటే మనల్ని అందరూ గౌరవిస్తారో అలాంటి సూత్రాలను నేనుకూడా పాటించాను. కాబట్టే ఈ నాటికికికూడా అత్తగారింట్లో అందరిచేత మన్ననలు పొందుతున్నాని అమ్మ అంది.
ప్రతి తల్లిదండ్రులుకూడా తమ బిడ్డ అత్తగారింటికి వెళ్ళి అందలమెక్కాలని, వారి చేత గౌరవింపబడాలని కోరుకుంటుంటారు. ఇలా కోరుకోవడంలో తప్పు లేదు. ప్రతి చిన్న విషయానికి అత్తగారింటివారు తమ బిడ్డని సలహాలు అడిగి తీసుకోవాలనే కోరుకుంటుంటారు. దీనికి కొన్ని చిట్కాలు మీ అమ్మాయికి నేర్పండి. ఆ చిట్కాలు మీ అమ్మాయి తన అత్తగారింట్లో పాటిస్తే ఆమెకూడా మా అమ్మలాగే అందరి మన్ననలు పొంది గౌరవింపబడుతుందని ఆశిస్తాం.
ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహం అయిన తర్వాత అమ్మాయి తన భర్తకు బానిసగా మారకూడదు. అతను మీ అమ్మాయికి జీవిత భాగస్వామి అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆమె ప్రతి బాధ, ఆనందంలోనూ అతను పాలుపంచుకోవాలి. మనిషి జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని పంచుకునేందుకు సమాజంలో కోట్లమంది ఉంటారు. కాని ఒక స్త్రీ బాధను పంచుకునేందుకు కేవలం ఆమె భర్త అనేది అతను గుర్తెరిగేలా అమ్మాయి మసలుకోవాలి. |