ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఉమెన్స్ స్పెషల్ > "సమాచార హక్కు చట్టం"పై పీహెచ్‌డీ చేసిన తొలి మహిళ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"సమాచార హక్కు చట్టం"పై పీహెచ్‌డీ చేసిన తొలి మహిళ
FILE
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన "సమాచార హక్కు చట్టం"పై హీహెచ్‌డీని సాధించిన తొలి మహిళగా... ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఓ మహిళ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

వివరాల్లోకి వస్తే... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, విడవలూరుకు చెందిన మడపర్తి సరోజనమ్మ అనే మహిళ సమాచార హక్కు చట్టంపై పీహెచ్‌డీ చేసిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఈ విషయాన్ని విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారు ప్రకటించినట్లు సరోజనమ్మ మీడియాకు వెల్లడించారు.

ఇదిలా ఉంటే... ఇప్పటిదాకా సమాచార హక్కు చట్టంపై పీహెచ్‌డీ చేసినవారు దేశంలోనే ఎవరూ లేరు. సరోజనమ్మ మొదటిసారిగా భారతదేశంలో ఈ చట్టంపై విమర్శనాత్మక పరిశోధనలు చేయడం ద్వారా పై గౌరవాన్ని సాధించగలిగారు. కాగా, ఈమె విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే ఎం.ఎల్. పూర్తిచేసి, అక్కడే అధ్యాపకురాలిగా స్థిరపడ్డారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వరకట్న వేధింపుదారులకి ఉరి శిక్ష: అమలే ప్రశ్న
గర్భిణీలకు ప్రత్యేకమైన ఆహారం!
తొలి మహిళా స్పీకర్‌గా మీరా కుమార్
అమ్మాయిని అత్తగారింట్లో అందలమెక్కించండిలా...!
హాటెస్ట్ మహిళ మిషెల్ ఒబామా
సౌనాకు సన్‌సిల్క్ బిందాస్ బ్లూ కార్పెట్ స్వాగతం