ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » ఉమెన్స్ స్పెషల్ » మగవారిని ఆకర్షించాలంటే! : మిషేల్ (Man | Woman | Attraction | Mind | Heart | Michel Obama | America | President)
Feedback Print Bookmark and Share
 
FILE
మగవారిని ఎలా ఆకర్షించాలి అనే దానిపై పాఠాలు చెప్పేందుకు అమెరికా ప్రథమ మహిళ మిషేల్ ఒబామా సిద్ధమౌతోంది.

మగవారిని తమ బుట్టలో పడేయడానికి శారీరక అందంతోపాటు మానసిక అందం ఎంతో ముఖ్యమైందని, మగవారి బ్యాంక్ బ్యాలెన్స్ చూసేకన్నా వారి మనసేంటో అర్థం చేసుకోవాలని మిషేల్ ఒబామా మహిళామణులకు సూచిస్తున్నారు.

గత 17 సంవత్సరాలుగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామా సతీమణిగా వెలుగొందుతున్న మిషేల్ గ్లామర్ మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వూలో ఈ విషయం తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళామణులు... మీలో మానవత్వం అనేది ఉండాలి. శారీరక సౌందర్యమే కాకుండా, మానసిక సౌందర్యం కూడా తోడైతే మీ జీవితం స్వర్గమయమేనని ఆమె అన్నారు.

శారీరక సౌందర్యం ఎక్కువ కాలం నిలబడదు. అదే మానసిక సౌందర్యమైతే కలకాలం నిలిచిపోతుంది. మహిళలకు మగవారి బ్యాంక్ బ్యాలెన్స్ ప్రధానం కాకూడదు. వారి మానసిక ఆనందమే మనకు పెట్టని కోట వంటిదని ఆమె తెలిపారు.

వారిలోని ఆత్మను చూడండి. మహిళలు ముఖ్యంగా మగవారి మనసును అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితం స్వర్గమయం అవుతుందని ప్రపంచంలోని మహిళామణులను తాను కోరుకునేది అదేనని ఆమె తెలిపారు. మగవారి అభ్యున్నతే మనకు ఆదర్శం కాగలదని ఆమె అన్నారు.

సో...మహిళామణులు, ఇకపై మగవారి మనసును అర్థం చేసుకుని మసలుకుంటారు కదూ...!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.