ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » ఉమెన్స్ స్పెషల్ » మార్చి 8న మహిళా దినోత్సవం (Women's day | Wishes | British | MP | John stuart mill | Vote | Parliament | New Zealand | Germany | Social democratic party)
Bookmark and Share Feedback Print
 
FILE
బ్రిటీష్ ఎంపి జాన్ స్టార్ట్ మిల్ల్ 1869వ సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు కావాలని బ్రిటీష్ పార్లమెంటులో ప్రస్తావించి డిమాండ్ చేశారు. 1893 సెప్టెంబరు 19న న్యూజిలాండ్ ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ తీర్మానం చేసిన ఏకైక దేశం. ఇతర దేశాలలో మహిళలకు ఓటు హక్కు చాలా సంవత్సరాల వరకు లభించలేదు.

కోపెన్‌హెగన్‌లో 1910వ సంవత్సరంలో రెండవ అంతర్జాతీయ మహిళా ఉద్యోగినుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మహిళలకు ప్రత్యేకంగా ఓ రోజుండాలని అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రతి దేశంలోని మహిళలు జరుపుకోవాలని జర్మనీకి చెందిన సోషియల్ డెమోక్రటిక్ పార్టీలోని వుమెన్స్ కార్యాలయంలో అధికారి అయిన క్లారా జెట్‌కిన్ కోరారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులు తమ కోర్కెలను విన్నవించుకునే వెసలుబాటు కలగాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో 17 దేశాలనుంచి వివిధ సంఘాలకు చెందిన మహిళా నాయకురాళ్ళు దాదాపు వందమంది హాజరైనారు. ఇందులో ఆమె చెప్పిన డిమాండుకు ప్రతి ఒక్కరు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు చెప్పారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
FILE


తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 19 (మార్చి 8న కాదు) జెక్టిన్ ఘనంగా ప్రారంభించారు. పర్షియన్ రాజు మహిళలకు ఓటు హక్కు కల్పిస్తామని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునేందుకు మార్చి 19 1848న అంగీకరించాడు. తదుపరి అతను ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చాడు. కాని మహిళలకు ఓటు హక్కును కల్పించడం మాత్రం చట్టబద్ధత కల్పించలేదు. ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయాడు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.