మహిళలకు సంబంధించి దేశీయ చట్టాలు ఏం చెబుతున్నాయి...
సోమవారం, 8 మార్చి 2010( 11:01 IST )
FILE
స్త్రీలపై దేశంలో నానాటికీ జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు గత దశాబ్ద కాలంగా ఎన్నో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ చట్టాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. అలా మహిళల కోసం రూపొందించిన చట్టాలు నోచుకుని ఉన్నట్లయితే భారత దేశంలో మహిళల పట్ల వివక్ష మరియు అత్యాచారాలు ఈపాటికే సమసిపోయి ఉండేవి.
కానీ నేటి పురుషాధ్యికత సమాజంలో విశృంఖలమైన పరిస్థితులు ఈ అద్భుత ఆవిష్కరణకు అడ్డుపడుతున్నాయి. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకు ఈ చట్టాలు అమలుకు నోచుకుంటున్నాయి. భారతీయ చట్ట సభలలోని ప్రతి అంశం కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ రూపుదిద్దుకుంటున్నాయి. ఈ విషయమై మహిళలు సంపూర్ణమైన అవగాహనను కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దేశీయ చట్టాలలోని 14వ అధ్యాయం ద్వారా సమ న్యాయం, అధ్యాయం 15 (3) లో జాతి, ధర్మం, లింగం మరియు జన్మస్థానం తదితరాలను అనుసరించి భేదభావం చూపరాదు. అధ్యాయం 16 (1) ని అనుసరించి సమాజ సేవలో బేధభావం లేకుండా సమానత్వం పాటించాలి. అధ్యాయం 19 (1) లో సమాన రూపంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, స్త్రీ మరియు పురుషులను ప్రాణ, దేహపరమైన అంశాలలో స్వాధీనం చేసుకునేందుకు వారిని వంచించిరాదని అధ్యాయం 21 తెలుపుతోంది.