ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » ఉమెన్స్ స్పెషల్ » మహిళలకు 30 శాతం రిజర్వేషన్: జర్మన్ కంపెనీ (Deutsche | Frankfurt | CEO | Rene Obermann | Germany | India | Woman reservation bill | Loksabha)
Bookmark and Share Feedback Print
 
FILE
ప్రస్తుతం భారతదేశంలో మహిళామణులకు రిజర్వేషన్ కల్పించేందుకు పలు రాజకీయ పార్టీలు విముఖత ప్రదర్శిస్తున్నాయి. దీంతో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ఆమోదించలేకపోతోంది. కాని జర్మనీకి చెందిన టెలికాం కంపెనీ డ్యూత్సే టెలికాం సంస్థ ఈ దిశగా అడుగులు వేస్తోంది. మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఉద్యోగావకాశాలు తగిన స్థానం కల్పించేందుకు ఆ సంస్థ ప్రణాళికలు రూపొందించుకుంది.

తమ సంస్థ మహిళలకు ప్రత్యేక కోటా కల్పిస్తున్నామని జర్మనీకి చెందిన టెలికాం కంపెనీ డ్యూత్సే సంస్థ సోమవారం వెల్లడించింది. డేక్స్-30 కంపెనీల్లో ఇది ఒక కంపెనీ. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రధాన కార్యనిర్వహణాధికారి రెనే ఓబెర్మాన్ మాట్లాడుతూ వచ్చే ఐదు సంవత్సరాలలో తమ కంపెనీలో ముఫై శాతం మంది మహిళామణులను నియమిస్తామని తెలిపారు.

ప్రస్తుతం తమ కంపెనీలో కేవలం 13 శాతం మాత్రమే మహిళలు ఉన్నత పదవులలో ఉన్నారని, ఈ సంఖ్యను మరింత పెంచేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఉన్నత పదవులలో మహిళలను నియమించడంతో తమ సంస్థ మరింతగా వృద్ధి చెందగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.