ప్రధాన పేజి > ఇతరాలు > యోగా > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేను తెగ తింటాను : శిల్పా శెట్టి  Search similar articles
FILE
ఖచ్చితమైన శరీర ఆకృతికోసం చేసే వ్యాయామం మరియు యోగా, క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు అన్నీ కలిసి తన శరీర ఆకృతిని ఆకర్షణీయంగా చేస్తున్నాయని 33 ఏళ్ల బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి చెపుతోంది. ఇటీవల యోగాపై ఓ వీడియో క్యాసెట్ సైతం విడుదల చేసిన ఈ భామ తాను ఆకర్షణీయంగా ఉండేందుకు ఏమేమి చేస్తుందన్న వివరాలను చెప్పుకొచ్చింది.

యోగా చేయటం వల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఉండటమేకాదు, మనసు తేలికపడుతుందనీ అంటోంది. ఆ మధ్య తనను వేధించిన మెడనొప్పిని యోగా చేయటం ద్వారా వదిలించుకుందట. అయితే యోగా చేసేవారు తప్పకుండా నిపుణుల సలహా మేరకే చేయాలంటోంది ఈ సెక్సీ భామ.

తిండి తింటే లావైపోతామేమోనని కొందరు ఆందోళనపడుతుంటారు.... అయితే తనకు మాత్రం అటువంటి భయాలేమీ లేవంటోంది. పాలమీగడలతోపాటు, చికెన్ వంటివన్నీ ప్రతి రోజూ లాగించేస్తానంటోంది. అయితే మనమూ యోగా చేసి చూస్తే పోలా... ఏమంటారు...?
మరిన్ని
యోగాసనాలు వేసే ముందు...
యోగా అంటే ఏమిటి..?