ప్రధాన పేజి > ఇతరాలు > యోగా > ఆసనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నౌకాసనంతో వెన్ను సమస్యలకు విముక్తి  Search similar articles
WD
పేరు వింటేనే నౌకాసనం ఎలా ఉంటుందనే విషయంపై మీకు ఈపాటికే ఓ అవగాహన వచ్చి ఉంటుంది. అవును నౌకాసన భంగిమ నౌకలాగే ఉంటుంది. ఇందులో అవలంభించే పద్ధతి కొద్దిపాటి తేడాలు మినహాయించి ఊర్ధ్వ పాద హస్తాసన భంగిమలాగే ఉంటుంది.

ఆసన వేసే విధానం:
• నేలపై అలాగే శరీరం సమతలంగా ఉండేలా పడుకోవాలి.
• మీ రెండు చేతులను మీ తొడలపై (ఊర్ధ్వపాద హస్తాసనలో ఉన్నట్టు) పెట్టాల్సిన అవసరం లేదు.
• దానికి బదులు మీ భుజాలను తలదాకా చాచాలి.
• ఎగువ భుజాలు చెవులను తాకుతున్నట్టు ఉండాలి.
• గాలి పీలుస్తూ మీ కాళ్లు, నడుము, భుజాలు, మెడ, తల, అలాగే నేల నుంచి 60 డిగ్రీల కోణంలో పైకి లేపాలి.
• ఇలా చేసేటపుడు భుజాలను నేరుగా ఉంచండి.
• అలాగే మీ పాదాల వేళ్లకు సమాంతరంగా మీ భుజాలను ఉంచాలి.
• కాళ్ల వేళ్లు చేతికొనలకు సమాన స్థాయిలో ఉండాలి.
• మీ చూపును కాలి మొనలపైనే శ్రద్ధంగా పెట్టండి.
• ఈ సమయంలోనే మీ శరీరం మీ వెన్నును ఆధారంగా చేసుకుని ఉంటుంది.
• శ్వాస గట్టిగా బిగపట్టండి.
• ఇలాగే ఓ ఐదు నిమిషాల పాటు నిలవండి.
• ఇపుడు మీ శరీరం నౌకాకృతిని సంతరించుకుంటుంది. ఇలా చేయడాన్నే నౌకాసనంగా చెబుతున్నారు.
• నెమ్మదిగా శ్వాస బయటకు వదులుతూ ఆ స్థితి నుంచి ప్రారంభ స్థితికి రండి.

ప్రయోజనాలుః
• ఈ నౌకాసన భంగిమ ద్వారా ఉదరం, వెన్ను, భుజ, మెడ, కింది భాగంలోని అవయవాలను పటిష్ట పరుస్తుంది.
• వెన్ను సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
• ఛాతీ భాగం వెడల్పయ్యేలా చేసి, మీ ఊపిరితిత్తులు బలపడేలా చేస్తుంది.
• ఈ ఆసనం వెన్ను చివరి భాగం, కాళ్లు, మోకాలి కింది కండరాలు, మోకాళ్లు, తొడలు, భుజాలు, నడుము భాగాలకు మంచి శక్తిని అందిస్తుంది.
వీడియోను వీక్షించండి
మరిన్ని
హలాసనంతో ఉపయోగాలు ఎన్నో.. ఎన్నెన్నో...  
నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరిచే సర్వాంగాసన  
విపరీత కరణి ఆసనం  
మదుమేహానికి విరుగుడు మయూరాసనం  
జ్ఞానేంద్రియాల పనితీరును మెరుగుపరిచే బ్రహ్మముద్ర  
నరాలను ఉత్తేజపరిచే పశ్చిమోత్తానాసనం