ప్రధాన పేజి > ఇతరాలు > యోగా > ఆసనాలు > శీర్షాసనంతో అదనపు తెలివితేటలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శీర్షాసనంతో అదనపు తెలివితేటలు
Seershasana
FileFILE
తలను ఆధారం చేసుకుని తల్లకిందులుగా నిలబడే ఆసనాన్ని శీర్షాసనం అంటారు. శీర్షం అంటే సంస్కృతంలో తల అని అర్థం. పునరత్పత్తి గ్రంథులు, గుండె, కండరాలకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది.

పద్దతి
చదునైన నేల మీద మోకాళ్ళపై కూర్చోవాలి. ముందుకు చాచి ముందుకు సాగిలా పడి మోచేతులను నేలపై ఆనించాలి. రెండు చేతుల వేళ్ళను ఒకదానితో ఒకటి కలపాలి. కలిపిన చేతివేళ్ళ లోపలివైపుగా తలపై భాగాన్ని నేలపై ఆనించాలి.

మెల్లగా మోకాళ్ళను చక్కగా చేస్తూ తుంటి భాగాన్ని పైకి లేపాలి. ఇప్పటికి శరీరం తిరగేసిన ఆంగ్ల అక్షరం 'వి' ఆకారంలోకి వస్తుంది. పాదాలను తలకు దగ్గరగా తీసుకురావాలి. ఈ స్థితిలో మోకాళ్ళను వీలైనంత వరకూ వంచాలి. వంచిన మోకాళ్ళు ఛాతీ దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి. అలాగే పాదాలు పిరుదలకు దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడలాలి. ఈ స్థితి నుంచి కాళ్ళు మెల్లగా నేలకు అభిముఖంగా లేవనెత్తాలి.

ఈ స్థితిలో కొన్నిసెకనులు నిలబడాలి. తరువాత మెల్లగా పూర్వ స్థానానికి రావాలి. ఇందుకోసం మోకాళ్ళు వంచాలి. ఈ స్థితిలో మోకాళ్ళు ఛాతీని తాకుతున్నట్లు చూసుకోవాలి. తరువాత కాళ్ళను మేల్లగా నేలపైకి తీసుకురావాలి. ఈ స్థితిలో తలను కొన్ని సెకనలు ఉంచాలి. ఆపై మెల్లగా వజ్రాసనానికి రావాలి. ఆ తరువాత మెల్లగా మొదటి స్థానానికి రావాలి.

తీసుకోవాలసిన జాగ్రత్తల
యోగా కొత్తగా సాధన చేసే వారు కాస్తా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదట చేసే వారు గోడను ఆధారంగా సాధన చేయడం మంచిది. ఈ ఆసనం వేసేటప్పుడు ఇనస్ట్రక్టర్‌ను తీసుకోవడం మంచిది. కాళ్ళు ఒక్కసారిగా పైకి లేపడం మంచిది కాదు.

తిరిగి మొదటి స్థితిలోకి వచ్చే సమయంలో ఒక్కసారిగా కాళ్ళ ఒక్కసారిగా కిందికి దించడం కూడా అంత మంచిది కాదు. వజ్రాసనంలోకి వచ్చే ముందు తల కొన్ని సెకనులు నేలపై ఉంచాలి.వెన్ను నొప్పి, ఉదర సంబంధిత సమస్యలు ఉన్న వారు ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.

ఉపయోగాలు
శీర్షాసనం వలన అజీర్తి ఉన్న వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థలోని గ్రంథులు ప్రక్రియ మెరుగు పడుతుంది. అలాగే పునరుత్పత్తి గ్రంథులు, హృదయ కండరాలు చాలా ఉపయోగం ఉంటుంది. ఆసనం వలన మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విశాల స్వభావం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వీడియోను వీక్షించండి
మరిన్ని
సూర్యనమస్కారం అందరికి శ్రేయస్కరమే  
కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం  
పాదహస్తానంతో మరింత జీర్ణశక్తి  
శరీర సమతుల్యానికి అర్ధ చంద్రాసనం  
తాడాసనంతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం  
పూర్ణ ధనురాసనంతో శరీరానికి మరింత బలం