ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > కథనాలు > యువతకు ఉపాధి కల్పించే టాప్-10 రంగాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యువతకు ఉపాధి కల్పించే టాప్-10 రంగాలు
శరవేగంగా మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వ కొలువులను తోసిరాజని, ప్రైవేటు ఉద్యోగాల కోసం నేటి యువత పోటీ పడుతోంది. ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ధితో ఈ గణనీయ మార్పు చోటుచేసుకుంది. దీనికి ధీటుగా మరికొన్ని రంగాలు కూడా యువతకు ఉపాధి కల్పించేందుకు పోటీ పడుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాల కంటే.. ప్రైవేటు సంస్థల ఉద్యోగాలపై యువత ఆసక్తి చూపడానికి పలు కారణాలు ఉన్నాయి. విలాసవంతమైన సౌకర్యాలతో పాటు భారీ జీతభత్యాలు, అలవెన్సులు, కారు, మధ్యాహ్న భోజనం, ఇంటి నుంచి కారులో పికపింగ్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందువల్లే ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత ప్రైవేట్ ఉద్యోగాలపై మోజు చూపుతోంది.

ఇందులోభాగంగా ప్రస్తుతం దేశంలో యువతకు ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో టాప్‌టెన్ చోటు సంపాదించిన విభాగాలు రంగాలు ఉన్నాయి. వాటిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, కాల్ సెంటర్స్, అనిమేషన్/గ్రాఫిక్స్, హోటల్ మేనేజ్‌మెంట్, అడ్వర్‌టైజింగ్, టూరిజం మేనేజ్‌మెంట్, రేడియో జాకియింగ్, టీవీ ప్రజంటేషన్/జర్నలిజం, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాకింగ్, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ రంగాలు ఉన్నాయి. ప్లేస్‌మెంట్ ఏజెన్సీల సమాచారం మేరకు... హోటల్, మేనేజ్‌మెంట్ రంగాలు ఎక్కువ ఉపాధి కల్పిస్తూ అగ్రస్థానంలో ఉన్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఐబీఎం వారి "బ్లూ స్కాలర్" శిక్షణ
కేంబ్రిడ్జి విద్యార్థుల "గ్రంథ చౌర్యం"
మీలో ఇవి ఉంటేనే ఉద్యోగం..!
"సృజనాత్మక వాతావరణం" అంటే..?
కామర్స్ గ్రూపులకు పెరుగుతున్న ఆదరణ  
"సాఫ్ట్ స్కిల్స్" అంటే..?