ప్రధాన పేజి   వార్తలు  కెరీర్  వార్తలు
 
టీఎన్‌పీఎస్‌సీ ఛైర్మన్‌గా కాశీ విశ్వనాధన్ నియామకం
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్‌గా ఎ.ఎం. కాశీ విశ్వనాధన్ నియమిస్తూ ముఖ్యమంత్రి కరుణానిధి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర గవర్నర్ బర్నాలా సలహా మేరకు ముఖ్యమంత్రి కరుణానిధి ఈ చర్యలు చేపట్టారు.

కాశీ విశ్వనాధన్ పదవీ బాధ్యతలను ఈ నెల 29 నుంచి చేపడతారు. అంతకుముందు రోజున ప్రస్తుత ఛైర్మన్ యాషిమ్ అహ్మద్ పదవీ విరమణ చేయనున్నారు. కాశీ విశ్వనాధన్ సేలం జిల్లా చిన్నానూర్ గ్రామానికి చెందినవారు కాగా, విద్యాభ్యాసాన్ని సేలం, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తిచేశారు.

ఆ తర్వాత విశ్వనాధన్ తిరుచిరాపల్లి జిల్లా డెప్యూటీ కలెక్టర్‌గా ప్రభుత్వ సేవలను ప్రారంభించారు. 1994 లో సివిల్స్‌లో ఉత్తీర్ణులై ఐఎఎస్ అధికారిగా మారారు. ఆ తర్వాత మదురై జిల్లా కలెక్టర్‌గాను, రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్‌గా వ్యవహరించి గత ఏడాది ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేస్తూ ఈ పదవికి ఎదిగారు.
మరిన్ని
విద్యాశాఖ మౌలిక సదుపాయాలు అభివృద్ది: జమ్మూ కాశ్మీర్
బయోలాజీ ఒలంపియాడ్‌కు నలుగురు భారతీయల ఎంపిక
పారదర్శకతతోనే స్వయం పోషక కళాశాల్లో ప్రవేశం: కేరళ
చైనాలో కళాశాల ప్రవేశ పరీక్షకు 95 లక్షల మంది హాజరు
ఐసెక్‌ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు
సెట్విన్‌ పరిధిలో మరో రెండు కొత్త శిక్షణా కేంద్రాలు