మారుతున్న కాలానికి అనుగణంగా యువత కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఫ్యాషన్, మోడలింగ్ విభాగాల్లో ఈ మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. యువత ఫ్యాషన్ ధోరణిని నిశితంగా గమనించిన పలు ప్రైవేట్ సంస్థలు తమ ఇష్టానుసారంగా దుస్తులను డిజైనింగ్ చేస్తూ.. వాటిని సినీ తారలతో ప్రమోట్ చేయిస్తున్నాయి. దీంతో యువత సులభంగా కొత్త ఫ్యాషన్ పట్ల సులభంగా ఆకర్షితులవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో దేశం వ్యాప్తంగా మంచి పేరున్న సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్టీ). ఈ సంస్ధ ఫ్యాషన్ రంగానికి సంబంధించి డిజైనింగ్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ (పీజీ కోర్సులు), లెదర్ డిజైనింగ్, యాక్సెసరీ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, అప్పారెల్స్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ (యూజీ) వంటి కోర్సులను అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే ఈ సంస్థకు న్యూఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, గాంధీనగర్, ముంబై, రాయ్‌బరేలిలలో కేంద్రాలు ఉన్నాయి. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలలో కనపరిచే ప్రతిభ మూలంగా అభ్యర్థులకు నిప్ట్ ప్రవేశం కల్పిస్తుంది. ఈ కోర్సుల్లో చేరేందుకు నిఫ్ట్ తాజాగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీటి స్వీకరణకు ఈనెల 31వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించింది.
|