ఈ సంవత్సరపు ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్షను జూన్ ఏడవతేదీన నిర్వహించనున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (యూపీఎస్‌సీ) సోమవారం ప్రకటించింది. పరీక్ష విధానం మరియు సిలబస్, పరీక్షా కేంద్రాలు, దరాఖాస్తులు పూర్తి చేయడంలో పాటించవలసిన మార్గదర్శకాలను ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 12 నాటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/రోజ్‌గార్ సమాచార్ సంచికలో ప్రచురితమైన సమగ్రమైన పరీక్ష ప్రకటన ద్వారా పొందవచ్చునని తెలిపింది.
అదనపు సమాచారం మరియు దరఖాస్తులు, అభ్యర్థిత్వానికి సంబంధించిన మరిన్ని వివరాల కొరకు ఆసక్తి గల అభ్యర్థులు యూపీఎస్‌సీ ఏర్పాటు చేసిన కేంద్రంలో వ్యక్తిగతంగా లేదా క్రింద తెలియపరిచిన ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు: 011-23385271/011-23381125/011-23098543.
అదేసమయంలో పరీక్ష వివరాలతో పాటు దరఖాస్తు నమోదు చేసుకునే విధానం, పరీక్ష కేంద్రాలు మరియు ఫలితాలను యూపీఎస్‌సీ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూపీఎస్‌సీ.జీవోవీ.ఐఎన్ నుంచి పొందవచ్చు.
|