బ్రిటన్ విద్యకు ఊతమందించే ఏజెంట్లకు సర్టిఫైడ్ శిక్షణా కార్యక్రమాన్ని బ్రిటీష్ కౌన్సిల్, బ్రిటీష్ డిప్యూటీ హైకమీషన్ సంయుక్తంగా అభివృద్ధి పరిచాయి. కొత్తగా అభివృద్ది చేసిన శిక్షణా కార్యక్రమం ద్వారా బ్రిటన్ విద్యా వ్యవస్థపై ఏజెంట్లకు సంపూర్ణ అవగాహన కలుగుతుందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బ్రిటీష్ ఏంబసీ పేర్కొంది. అంతేకాక బ్రిటన్ శిక్షణా వ్యవస్థ, విద్యా కోర్సులు, ప్రతి స్థాయిలో విద్యార్థులకు ఉండవలసిన అర్హతలు, నాణ్యతా హామీ విధానాలు మరియు నిర్వహణ తదితర అంశాలపై ఏజెంట్లకు అవగాహన కలిగిస్తారు.
అదేసమయంలో బ్రిటన్‌లో విద్యార్థికి అయ్యే ఖర్చు, ప్రయాణం మరియు వసతి, కోర్సు రుసుము, ఉపకారవేతనాలు, బ్రిటన్‌లో అంతర్జాతీయ విద్యార్థుల సంక్షేమం, స్థానికంగా వారికి లభించే మద్దతు, బ్రిటన్ దరఖాస్తు పద్దతులు, ప్రామాణిక ప్రవేశ అవసరాలు, వీసా మరియు వలస నియమనిబంధనలు తదితరాలను ఏజెంట్లకు పరిచయం చేస్తారు.
మూడు నెలలపాటు కొనసాగే ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమం ముగిసిన అనంతరం ఏజెంట్లు పొందే సర్టిఫికేట్లకు బ్రిటన్ సంస్థలు గుర్తిస్తాయి. ఇప్పటివరకు దక్షిణ భారతానికి చెందిన 36 మంది ఏజెంట్లు శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఏంబసీ తన ప్రకటనలో వెల్లడించింది.
|