ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పరీక్షల భయాన్ని పారదోలే వర్క్‌షాప్
విద్యార్థులలో పరీక్షల పట్ల గల భయాన్ని పారదోలే దిశగా ఒక రోజు వర్క్‌షాప్‌ను ఏవోన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మోడరన్ సైన్సెస్ (ఏఐఎమ్‌ఎస్) జనవరి 27న చెన్నైలో నిర్వహిస్తోంది. బిగ్ ప్లస్ సెంటుమ్ పేరిట ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం సౌజన్యంతో జరిగే వర్క్‌షాప్‌లో దాదాపు 50 పాఠశాలలకు చెందిన మార్చి మాసంలో ప్లస్ టూ బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులు పాల్గొంటున్నారని ఏఐఎమ్ఎస్‌ ప్రతినిధి గీతా ప్రభు గురువారం మీడియాతో అన్నారు.

పరీక్షల పట్ల భయాన్ని అధిగమించడం, పరీక్షా హాల్‌లోకి ప్రవేశించే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం అనే అంశాలపై వర్క్‌షాప్‌లో కొన్ని అభ్యాసాలను ప్రదర్శిస్తామని గీత తెలిపారు. సమర్పణ నైపుణ్యాలు, గతంలో జరిగిన పరీక్షలకు చెందిన నమూనా ప్రశ్నాపత్రాలను పూర్తి చేయడంలో మెలుకువలు, పరీక్షల సమయంలో అప్రమత్తత, వత్తిడికి గురికాకుండా పరీక్షా హాలులో సమయపాలన తదితర అంశాలపై వర్క్‌షాప్‌లో ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలపై సమగ్రమైన అవగాహనను కలిగి ఉన్నప్పటికీ, అత్యున్నత మార్కులను సాధించడంలో కీలకమైన అంశాలపై అవగాహన లేకపోవడంతో విద్యార్థులు మార్కులు కోల్పోతున్నారని ఆమె అన్నారు.
మరిన్ని
బ్రిటీష్ కౌన్సిల్‌ ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలు
జూన్ ఏడున యూపీఎస్‌సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల సంత
విదేశీ విశ్వవిద్యాలయాలతో టాటా ఒప్పందం
పర్యాటక రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు: సోనీ
ఆదర్శ్ పాఠశాలల ప్రాజెక్టుకు రూ. 142 కోట్లు