ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉస్మానియాలో బీపీఓ సదస్సు
బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ గ్లోబల్ ప్రొవైడర్ "24/7 కస్టమర్" హైదరాబాద్‌లోని నిజామ్ కళాశాలలో సోమవారం విద్యార్థుల కోసం బీపీఓ విజ్ఞాన సదస్సును నిర్వహించింది. భారతదేశంలోని కళాశాలలో మునుపెన్నడూ జరగని రీతిలో తొలిసారిగా బీపీఓ విజ్ఞాన సదస్సును నిర్వహించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. వివిధ క్షేత్రాలలో విద్యాభ్యాసం చేస్తున్న 200 మంది విద్యార్థులు సదస్సులో పాల్గొన్నట్లు తెలిపింది.

బీపీఓ పరిశ్రమ, పరిశ్రమలో పలు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించే దిశగా సదస్సును నిర్వహించినట్లు ప్రకటన పేర్కొంది. నిపుణులతో ఇష్టాగోష్టి సమావేశాలు జరుపడం ద్వారా బీపీఓ పరిశ్రమ పట్ల తమకుగల అపోహలు, సందేహాలను విద్యార్థులు నివృత్తి చేసుకున్నారని తెలిపింది. బీపీఓ పరిశ్రమ పట్ల విద్యార్థులలో సంపూర్ణ అవగాహన కలిగించే నిమిత్తం సదస్సును నిర్వహించారు.
మరిన్ని
పరీక్షల భయాన్ని పారదోలే వర్క్‌షాప్
బ్రిటీష్ కౌన్సిల్‌ ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలు
జూన్ ఏడున యూపీఎస్‌సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల సంత
విదేశీ విశ్వవిద్యాలయాలతో టాటా ఒప్పందం
పర్యాటక రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు: సోనీ