ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్ల సరసన ఐఎస్‌బీ
అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్లలో 20వ ర్యాంకును ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) పొందినట్లు లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ అజిత్ రంగ్‌నేకర్ మీడియాతో మాట్లాడుతూ ఆరంభించిన ఆరు సంవత్సరాల స్వల్పవ్యవధిలోనే భారతదేశంలో ప్రముఖ బిజినెస్ స్కూల్‌గా ఐఎస్‌బీ పేరు పొందిందని తెలిపారు.

అంతర్జాతీయ విధానాలు మరియు అంతర్జాతీయ నిష్ణాతులను పిలిపించి ప్రత్యేక తరగతులను నిర్వహించడం ద్వారా మేనేజ్‌మెంట్ విద్యా క్షేత్రంలో పలు నిర్ణయాత్మకమైన మార్పులకు ఐఎస్‌బీ శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ప్రపంచంలోని 100 పేరొందిన బిజినెస్ స్కూళ్లలో తక్కువ చరిత్ర కలిగిన స్కూల్‌గా ఐఎస్‌బీ ప్రత్యేకతను సంతరించుకున్నదని అజిత్ తెలిపారు. తమ విజయం వెనుక ఐఎస్‌బీకి చెందిన ప్రతి ఒక్కరి కృషి దాగి ఉందని పేర్కొన్నారు.
మరిన్ని
ఉస్మానియాలో బీపీఓ సదస్సు
పరీక్షల భయాన్ని పారదోలే వర్క్‌షాప్
బ్రిటీష్ కౌన్సిల్‌ ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలు
జూన్ ఏడున యూపీఎస్‌సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల సంత
విదేశీ విశ్వవిద్యాలయాలతో టాటా ఒప్పందం