గురునానక్ విశ్వవిద్యాలయంలో (జీఎన్‌డీయూ) జెనిటిక్ ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మానవ జెనిటిక్స్ విభాగం కలిగిన అతి తక్కువ విశ్వవిద్యాలయాలలో జీఎన్‌డీయూ ఒకటని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే విశ్వవిద్యాలయంలో నానో ప్రాజెక్ట్ అమలుకుగాను మూడు కోట్ల రూపాయల గ్రాంట్‌ను కేంద్రం మంజూరు చేసింది.
తాజా గ్రాంట్‌తో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నానో సైన్సు మరియు టెక్నాలజీలో పీజీ స్థాయి కోర్సును విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టనున్నది. ఇదిలా ఉండగా జీఎన్‌డీయూ పరిశోధనల డైరక్టర్‌గా అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఎస్ చాహల్ నియమితులయ్యారు.
|