ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్‌లో దుబాయ్ సంస్థ మహిళా కళాశాల
భారత్ మరియు ఫిలిప్పైన్స్‌లో కొత్త విద్యా సంబంధిత ప్రాజెక్టులను రూ. 16 కోట్ల వ్యయంతో ప్రారంభించనున్నట్లు దుబాయ్ కేంద్రంగా గల జయేద్ దాతృత్వ మరియు మానవతా కార్యకలాపాల ఫౌండేషన్ ఆదివారం ప్రకటించింది. దీర్ఘకాలం పాటు విద్యాకార్యక్రమాలు మరియు మానవాభివృద్ధి కార్యకలాపాలలో భాగంగా యూఏఈ ఆవిర్భావకులు స్వర్గీయ షేఖ్ జయేద్ బిన్ సుల్తాన్ అల్-నహ్యాన్ స్మృత్యర్థం న్యూఢిల్లీలో జయేద్ మహిళా కళాశాల, ఫిలిప్పైన్స్‌లో గల జోలోలో జయేద్ ఇస్లామిక్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు ఫౌండేషన్ డైరక్టర్ జనరల్ మహమ్మద్ బిన్ ఒబియాద్ అల్ దహాహెరి తెలిపారు.

న్యూఢిల్లీలో జయేద్ మహిళా కళాశాల ఏర్పాటుతో మానవాభివృద్ధికి దోహదపడే పెట్టుబడిగా పేర్కొనవచ్చునని యూఏఈలో భారత్ రాయబారి తల్మీజ్ అహ్మద్ ప్రశంసించారు. గడచిన 15 సంవత్సరాల కాలంలో మానవీయ కార్యక్రమాల సహాయార్థం భారత్‌లో 15 మిలియన్ దిర్హామ్‌లు, ఫిలిప్పైన్స్‌లో 10 మిలియన్ దిర్హామ్‌ల నిధులను ఫౌండేషన్ ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు.
మరిన్ని
గురునానక్ వర్శిటీ జెనిటిక్ ఇంజినీరింగ్ సెంటర్
అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్ల సరసన ఐఎస్‌బీ
ఉస్మానియాలో బీపీఓ సదస్సు
పరీక్షల భయాన్ని పారదోలే వర్క్‌షాప్
బ్రిటీష్ కౌన్సిల్‌ ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలు
జూన్ ఏడున యూపీఎస్‌సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష