ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విడుదల
Inter
WD
ఇంటర్మీడియట్ తొలి సంవత్సర ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్ జనరల్‌, ఓకేషనల్‌ పరీక్షా ఫలితాలను కలిపి ఒకే సారి విడుదల చేస్తున్నట్టు బోర్డు కార్యదర్శి ఎం.వీరభద్రయ్య తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వారు సాధించిన గ్రేడుల వివరాలను మాత్రమే ఇంటర్‌నెట్‌లో పొందుపరుస్తామని తెలిపారు.

పాసైన విద్యార్థుల మార్కుల వివరాలను పొందుపరచలేదని, అయితే ఫెయిలైన విద్యార్థుల విషయంలో మాత్రం మార్కుల వివరాలను అందులో పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా ఈ అవకాశం కల్పించినట్టు చెప్పారు.

ఈ ఫలితాలను ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాలు, ఈ సేవ నెంబర్‌ 1100కు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫోన్లతో కాల్‌ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఎం.వీర భద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇవిగాక ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం ద్వారా హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫోన్‌ నంబర్లు 1255225, 22222222, ఇతర ప్రాంతాల నుంచి 95401255225, 954022222222 నంబర్లకు డయల్‌ చేసి తెలుసుకోవచ్చు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
ఒక మిలియన్ పుస్తకాల విక్రయం
డీఎస్‌సీ-2008 ప్రకటన త్వరలోనే
డైట్‌సెట్ కౌన్సెలింగ్ 24నుంచి
పదోతరగతి పరీక్షలకు 10 వేలమంది గైర్హాజరు
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 12.5 లక్షల విద్యార్థులు