ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేయనుంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు బోర్డు కార్యాలయంలో పరీక్షా ఫలితాలను సంబంధిత ఉన్నతాధికారులు విడుదల చేస్తారు. గత నెలలో ముగిసిన ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,53,573 మంది రెగ్యులర్, 1,92,093 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరైన విషయం తెల్సిందే.
ఈ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో తొలిసారి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రేడింగ్ విధానంపై పలు రకాల విమర్శలు వచ్చినప్పటికీ.. దీన్నే కొనసాగిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రం మార్కులను వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఈ ఫలితాలను www.telugu.webdunia.comతో పాటు మరికొన్ని వెబ్‌సైట్లలో చూడొచ్చు. అంతేకాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌కు 1100 అనే నంబరుకు ఫోన్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. వీటితో పాటు 040-1255225, 040-22222222 అనే ఫోన్ నెబర్లలో తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
|