బిట్స్ (బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) పిలానీ విశ్వవిద్యాలయం 2008-09 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఈనెల తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభంకానుంది. 12వ తేదీ వరకు జరిగే ఈ ప్రవేశ పరీక్షను దేశ వ్యాప్తంగా 19 కేంద్రాల్లో నిర్వహిస్తారు. మొత్తం 1.15 లక్షల మంది అభ్యర్థులు ఈ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలకు హాజరుకానున్నాయి.
ప్రవేశ పరీక్ష రాసే అభ్యర్థుల ఫలితాలను కొన్ని గంటల్లోనే వెల్లడించే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష జరుగనుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు వివిధ ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ పరీక్షలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా బిట్స్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షకు హాజరుకావచ్చు.
ఇందులోభాగంగా.. బిట్స్ పిలానీ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మాత్రం తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని నిర్ణయించుకునే సౌకర్యం ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా కలుగనుంది. దీంతో ఈ ఏడాది పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 1,15,000 వేలకు చేరుకుంది.
ఇదిలావుండగా హైదరాబాద్‌లో బిట్స్-పిలానీ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే ప్రారంభమైతే అదనంగా మరో 600 మంది విద్యార్థులకు బిట్స్‌లో అడ్మిషన్ లభిస్తుంది.
|