వచ్చే నెల ఐదో తేదీన జరుపుకోనున్న 'ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని' పురస్కరించుకుని చెన్నై నగరంలోని అకార్డ్ మెట్రోపాలిటన్ ఐదు నక్షత్ర హోటల్ 'మై ఎన్విరాన్‌మెంట్' పేరుతో ఒక స్లోగన్ కాంటెస్ట్ (నినాదపు పోటీ)ను నిర్వహించనుంది. పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కలిగించే నిమిత్తం ఈ నినాద పోటీని నిర్వహించనుంది.
ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులు 8 నుంచి 16 సంవత్సరాల లోపువారై వుండాలి. పర్యావరణ పరిరక్షణ అంశంపై 20 పదాలకు మించకుండా ఆకట్టుకునే విధంగా ఒక నినాదాన్ని రాసి పంపాల్సి వుంటుంది. ఎంట్రీలను హోటల్ ఎట్ అకార్డ్ మెట్రోపాలిటన్ డాట్ కామ్ అనే మెయిల్‌కు పంపాల్సి వుంటుంది.
ఇందులో పోటీలో పాల్గొనే విద్యార్థి పేరు, పాఠశాల పేరు, వయస్సు, తరగతి, ఉత్తరప్రత్యుత్తరాల కోసం ఈ మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్లను విధిగా తెలుపాల్సి వుంటుంది. ఎంట్రీలను జూన్ నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు పంపాల్సి వుంది.
ఈ పోటీలో ఆకర్షణీయమై బహుమతులను గెలుచుకోవచ్చు. అలాగే.. పోటీ విజేతకు తన కుటుంబంతో సహా నాలుగు రోజుల పాటు అకార్డ్ మెట్రోపాలిటన్ ఐదు నక్షత్ర హోటల్‌లో బసచేసే అవకాశం కల్పిస్తారు. మిగిలిన వివరాల కోసం 28141000 లేదా 43911000 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
|