ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐఐటీలో నూటికి నూరు శాతం విజయాన్ని సాధించిన సూపర్ 30  Search similar articles
బీహార్‌లోని సూపర్ 30 సంస్థ నుంచి శిక్షణ పొందిన 30 మంది విద్యార్థులు ఐఐటీ- జేఈఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని ఐఐటీ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. తమ సంస్థ ఈ అరుదైన అవకాశం కోసం గత నాలుగేళ్లుగా ఎదురుచూస్తోందనీ, నేటికి ఆ కల నిజమైందనీ, ఈరోజు తమకు గుర్తిండిపోయే రోజు అనీ సూపర్ 30 డైరెక్టర్ ఆనంద్ కుమార్ అన్నారు.

ప్రతి ఏటా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచిత శిక్షణ ఇవ్వటమే కాక భోజన వసతి కూడా సూపర్ 30 కల్పిస్తోంది. తొలిసారిగా అట్టడుగు వర్గానికి చెందిన విద్యార్థులు తమ ప్రతిభను కనబరచారనీ సూపర్ 30 సంస్థలో భౌతికశాస్త్రాన్ని బోధించే అధ్యాపకులు, బీహారు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీసు అభియానంద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సరైన శిక్షణ, విద్యార్థుల కృషితోనే ఇది సాధ్యమైందన్నారు.

2007లో 28 మంది విద్యార్థులు ఎంపిక కాగా, 2006లోనూ అంతేమంది ఎంపికయ్యారన్నారు. తినేటపుడు, నిద్రపోయేటపుడు, నడిచేటపుడు, మాట్లాడేటపుడు.. .అన్ని వేళలో విద్యార్థుల దృష్టి ఐఐటీ గురించే ఆలోచించమని విద్యార్థులకు చెప్పామనీ, అందువల్లనే వందశాతం ఫలితాలను సాధించామన్నారు. సూపర్ 30 సంస్థపై మాజీ జపాన్ బ్యూటీ ఓ డాక్యుమెంటరీని కూడా చిత్రీకరించిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మరిన్ని
'మై ఎన్విరాన్‌మెంట్' పేరుతో స్లోగన్ పోటీ
నేడు సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్షా ఫలితాలు
నిఫ్ట్ పాట్నా శాఖకు భూమి కేటాయింపు
బెంగళూరులో పీఐఓ యూనివర్సిటీ
చెన్నైలో రష్యా ఎడ్యుకేషన్ ఫెయిర్
జులై 6న ఫిజియోథెరపీ ఉమ్మడి ప్రవేశపరీక్ష