ఛత్తీస్‌ఘర్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) సెంటర్ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన భూ సేకరణ పనులను ఛత్తీస్‌ఘర్ ప్రభుత్వం త్వరలో చేపడుతుంది. ఐఐఐటీ సెంటర్ ఏర్పాటు విషయంలో కేంద్ర విద్యుత్, వాణిజ్య శాఖల సహాయ మంత్రి జైరాం రమేష్‌కు ఛత్తీస్‌ఘర్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రం ఏర్పాటవుతుంది. రాజధాని రాయపూర్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రాజధానికి సమీపంలోని నయా రాయపూర్ వద్ద 8వేల ఎకరాల స్థలంలో శాటిలైట్ టౌన్‌షిప్‌ను ఏర్పాటుచేస్తుంది. రాయపూర్ నుంచి శాటిలైట్ టౌన్‌షిప్ 20 కి.మీ. దూరంలో ఉంది.
|