ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ 50వ స్నాతకోత్సవం శనివారం జరుగుతుంది. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ అధ్యక్షుడు షిహ్ చూన్ ఫాంగ్ ముఖ్యఅతిధిగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. విదేశీ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు ఐఐటీల స్నాతకోత్సవానికి రావడం ఇదే మొదటిసారని ఐఐటీ-కాన్పూర్ డైరెక్టర్ సంజయ్ చెప్పారు.
తమ విద్యా సంస్థలో కోర్సులను పూర్తిచేసుకున్న 993 మందికి డిగ్రీల ప్రదానం శనివారం జరుగుతుందన్నారు. ఇందులో మాస్టర్స్ డిగ్రీ వాళ్లు 389, 28 మంది ఎంబీఏ, డిజైనింగ్ మాస్టర్స్ కోర్సువారు ఆరుగురు, వివిధ విభాగాల్లో ఎంటెక్ పూర్తిచేసిన 356 మంది, డాక్టరేట్ డిగ్రీవారు 101 మంది ఉన్నారని వివరించారు.
|