యుమునా నదీ తీరాన అందమైన నగరం ఆగ్రాలో బెనిఫిట్ ఫిల్మ్ అకాడమీ (బీఎఫ్ఏ) ప్రారంభమైంది. ఈ విద్యా సంస్థలో బాలీవుడ్ మాజీ ముగ్గురు తారలు విద్యార్ధులకు నటన, గానం, నృత్యం వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తారు. సినిమా రంగంలో విద్యార్ధులు మరింత రాణించేందుకు త సంస్థ దోహదం చేస్తుందని బీఎఫ్ఏ ఛైర్‌పర్సన్ రూబీ ఆగర్వాల్ చెప్పారు.
పెరిసెప్ట్ పిక్చర్ కంపెనీతో తాము ఒప్పందం చేసుకున్నామన్నారు. తమ సంస్థకు అహ్మదాబాద్, వడోదరాలలో ఇప్పటికే కేంద్రాలు ఉండగా, మీరట్, మంగళూరు, సూరత్, జామ్ నగర్‌లలో ఈ ఏడాది చివరి నాటికి ఏర్పాటుచేస్తామని అగర్వాల్ వెల్లడించారు.
|