ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2009 (ఈసెట్ - 2009) నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఎఫ్.డి.హెచ్, బీఎస్సీ- గణితం అభ్యర్థులు ఇరువురికీ ఉమ్మడిగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ టెస్టుకు హాజరయ్యే విద్యార్థుల కోసం దరఖాస్తులను ఈనెల 16వ తేదీ నుంచి విక్రయిస్తారు.
పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి 16వ తేదీ వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ధరను రూ.300లుగా నిర్ణయించారు. కాగా, పూర్తి చేసిన దరఖాస్తులను అపరాధ రుసుం రూ.500లు చెల్లించి, మార్చి 23వ తేదీ వరకు సమర్పించవచ్చు. అలాగే రూ.1,000ల అపరాధ రుసుంతో మార్చి 31 వరకు, రూ.5,000లతో మే 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. |