రాష్ట్రంలోని 21 రీజినల్ కో ఆర్డినేటింగ్ సెంటర్లలో ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఎంసెట్ హాల్‌టిక్కెట్లను పంపిణీ చేయనున్నారు. ఈ తేదీల్లోపు ఆయా పరిధిలోని రీజినల్ కో ఆర్డినేటింగ్ సెంటర్ల నుంచి ఎంసెట్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను పొందవచ్చును. అలాగాకుండా ఈ సెంటర్ల నుంచి పొందలేని అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లను పోస్టు ద్వాకా పంపిస్తారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ విభాగానికి 3లక్షల మంది, మెడికల్ విభాగానికి 63వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. సాధారణ ఎన్నికల లెక్కింపు మే 16వ తేదీన జరుగుతున్నప్పటికీ, ఎంసెట్-2009ను మాత్రం యథావిధిగా మే 14నే నిర్వహించాలని ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. |