రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు ప్రత్యక్ష కౌన్సెలింగ్ ద్వారా తక్షణం నిర్వహించాలని ప్రోగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అంతర్ జిల్లా బదిలీలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేసింది.
సుమారు 56 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని పీఆర్టీయూ ప్రతినిధులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. |