ఫార్మసీలో కెరీర్, విద్యావకాశాలపై ఇఖ్రా సొసైటీ శనివారం ఉచిత కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమం లక్డికాపూల్‌లోని రాయల్ కోర్ట్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కౌన్సెలింగ్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్‌లో పరిశోధన, అభివృద్ధి విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ కేఎస్ జగనాధన్ ఫార్మసీ విద్యార్థులకు సలహాలు ఇస్తారు. ఈ కార్యక్రమంపై ఆసక్తివున్నవారు 9908177302 లేదా 9849487866 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు. |