వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » టెసాల్వ్ సర్వీస్‌తో కేసీజీ కాలేజ్ ఒప్పందం (KCG College | Tessolve Service | MOU)
 
చెన్నైకి చెందిన కేసీజీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, టెసాల్వ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ అవగాహన ఒప్పందంపై కేసీజీ కళాశాల డైరెక్టర్ అన్నే జాకబ్, టెసాల్వ్ సర్వీస్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు వి.వీరప్పన్ సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం కింద కళాశాల ల్యాబులకు అవసరమైన ఎస్ఓసీ లేదా ఎస్ఐపీ పరికారాలు, ప్రత్యేక మిక్స్‌డ్- సిగ్నల్, మెమోరీ, డిజిటల్, ఆర్ఎఫ్ ఉత్పత్తులను టెసోల్స్ అందజేయనుంది.

తాజాగా కుదిరిన ఒప్పందం కళాశాలలోని ఈసీఈ, ఈఈఈ విద్యార్థులకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని కళాశాల డైరెక్టర్ చెప్పారు. అంతేకాకుండా తమ విద్యార్థులకు ఎంబెడెడ్ వైర్‌లెస్ టెక్నాలజీ లెవెల్ 1, లెవెల్ 2 డిప్లమా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు టెసాల్వ్ అంగీకరించిందని వెల్లడించారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.