వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » డీఎడ్ అభ్యర్థులకు రిజర్వేషన్ తొలగింపు (DSC 2008 | Ded candidates | reservation lifts | High court | 30 percent | SGT)
 
డీఎస్సీ-2008 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీలో డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం రిజర్వేషన్‌ నిబంధన తొలగించారు. ఈ విషయమై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు బుధవారం జారీ చేసింది. రిజర్వేషన్‌ను పరిగణలోకి తీసుకోకుండా.. నియామకాలు చేపట్టవచ్చని ఈ మేరకు హైకోర్టు.. ప్రభుత్వానికి సూచించింది.

ప్రభుత్వం చేపట్టే ఈ నియామకాలు.. హైకోర్టు తీర్పు, సుప్రీం కోర్టు ఉత్తర్వులకు లోబడే ఉంటాయని కోర్టు తెలిపింది. అంతకుముందు... ఎస్‌జీటీ పోస్టుల భర్తీలో డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం రిజర్వేషన్‌ను కల్పించే నిబంధనను.. జీవో 28 ద్వారా ప్రభుత్వం చేర్చింది. ఈ రిజర్వేషన్‌లను సమర్థించిన పరిపాలనా ట్రిబ్యునల్.. గత నెల 31న ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే మెదక్ జిల్లాకు చెందిన బీఎడ్ అభ్యర్థులైన కె ఉమామహేశ్వరరెడ్డి తదితరులు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పటిషన్‌పై జస్టిస్ వీ ఈశ్వరయ్య, జస్టిస్ వి అఫ్జల్‌పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టారు. విచారణలో.. ప్రభుత్వ జీవో 28కి మద్దతు తెలిపుతూ.. డీఎడ్ అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించే నిబంధనను తొలగిస్తూ.. ధర్మాసనం తీర్పు చెప్పింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.