వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మళ్లీ మార్పు (Eamcet counselling | again change in dates | schedule | Eamcet entrance committee | Higher education council)
 
ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహణ తేదీల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంతకుముందు నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ 13 నుంచి 18వ తేదీ వరకు ఇంజినీరంగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గతంలో ఎంసెట్ ప్రవేశాల కమిటీ ప్రకటించింది.

అయితే వివిధ కాలేజీల్లోని ఖాళీలకు సంబంధించి వివరాల సేకరణ ఇంకా పూర్తి కాలేదనే ఉద్దేశ్యంతో ఈ షెడ్యూల్ తేదీల్లో మార్పులు చేస్తూ.. సెప్టెంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించేలా ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సీట్ల ఖాళీల సేకరణ సెప్టెంబర్ 14వ తేదీలోపు పూర్తి చేసి ఆయా కళాశాలకు నివేదికను అందిచనున్నారు.

ప్రస్తుతం మలివిడత కౌన్సెలింగ్‌కు 11,280 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 15 ఇంజినీరింగ్ కళాశాలల్లో 3,720 సీట్లు... అదనపు కోర్సులకు సంబంధించి వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 2,940 సీట్లు ఉన్నాయి. అదలా ఉంచితే.. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు వారికి కేటాయించిన కళాశాలల్లో చేరని పక్షంలో.. వాటిని కూడా ఖాళీలుగా పరిగణించి.. మలి విడత కౌన్సెలింగ్‌లో చేర్చనున్నారు.

కాగా, ఈ సీట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెప్టెంబర్ 15వ తేదీ నాటికి.. అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉంచుతామని ఉన్నత విద్యామండలి తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.