వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ (Under Graduate courses | special counselling | NG Ranga University | Sri Venkateswara Veternary University | Usharani)
 
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయం విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల సీట్ల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ప్రత్యేక కోటా కింద నిర్వహించే ఈ ప్రత్యేక కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఫిజికల్లీ హ్యాండీకాప్ (శారీరక వికలాంగులు)ల కోటాలో సీట్లు భర్తీకి సెప్టెంబర్ 16న... రక్షణశాఖ సిబ్బంది కోటాలో.. సీట్లు భర్తీ సెప్టెంబర్ 17న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. విలేకరులతో ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి రిజిష్ట్రార్ ఎం ఉషారాణి మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో ఉన్న హోమ్ సైన్సెస్ కళాశాలలో తాము పేర్కొన్న తేదీల్లో ఉదయం 9.30 గంటలకు ఈ కౌన్సెలింగ్ మొదలవుతుందన్నారు.

కాగా, వివిధ యూనివర్శిటీల్లో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీటెక్ ఫుడ్‌సైన్స్, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ సీఏబీఎం, బీవీఎస్‌సీ మరియు ఏహెచ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు పంపుకుని అర్హత సాధించిన అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాలకు.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఏఎన్‌జీఆర్ఏయుడాట్‌నెట్‌లో చూడాల్సిందిగా తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.