ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ టూ ఉద్యోగాలకు మరిన్ని ఖాళీలను చేర్చుతూ.. మరో అనుబంధ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 2008లో ఏపీపీఎస్సీ తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 462 ఖాళీలున్నట్లు పేర్కొంది.
ఇప్పుడు తాజాగా విడుదల చేసిన గ్రూప్ టూ అనుబంధ నోటిఫికేషన్‌లో మరో 220 ఖాళీలను చేర్చారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 682కు చేరుకుంది. ఇందులో 479 ఖాళీలు ఎగ్జిక్యూటివ్ స్థాయి, 203 ఖాళీలు నాన్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలున్నాయి.
అక్టోబర్ 1 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఇంటర్నెట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి వెల్లడించారు. కానీ... దీనికి సంబంధించి అక్టోబర్ 31వ తేదీలోపు చలానా రూపంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.