ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సన్నాహాలు? (DSC 2008 | School Assistant | Posts | selections | Ded | Bed | SGT)
స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెకెండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల నియామకాన్ని ప్రస్తుతానికి పక్కన పెడుతూ.. ఎస్ఏ పోస్టులనైనా భర్తీ చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఎస్‌జీటీ పోస్టుల సంఖ్య నోటిఫికేషన్‌కు సరిపోయే విధంగా లేకపోవడం.. అడుగడుగునా అడ్డంకులు.. డీఎడ్-బీఎడ్ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు.. ఈ ఒత్తిళ్లతో ప్రభుత్వం యోచనలో పడింది. దీంతో డీఎస్సీ 2008 నియామకాలపై మరో ఆలోచన చేయాలని భావిస్తోంది.
ఏదేమైనప్పటికీ.. సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చే వరకు ఎస్‌జీటీ పోస్టుల భర్తీని పెండింగ్ ఉంచాలని ప్రభుత్వం చూస్తోంది. ఎందుకంటే.. ఎస్‌జీటీ పోస్టులను పక్కన పెట్టి.. కనీసం.. ఎస్ఏ పోస్టుల నియామకాలు చేపట్టి.. తద్వారా అభ్యర్థుల్లో సంతృప్తిపరచాలని ప్రభుత్వం చూస్తోంది.
అంతకుముందు... డీఎస్సీ-2008 ద్వారా మొత్తం 52వేల టీచర్ పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టుల అప్‌గ్రేడేషన్ అంటూ సుమారు 12వేల ఎస్‌జీటీ పోస్టులకు గండి కొట్టింది. ఈ నిర్ణయంతో డీఎస్సీ నియామకాలు పెండింగ్‌లో పడిన విషయం తెలిసిందే.