ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » సెప్టెంబర్ 19న క్రీడా అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన (MBBS | BDS | September 19 | sportspersons | Certificates)
సెప్టెంబర్ 19న క్రీడా అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన
ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ కోర్సుల్లో చేరనున్న క్రీడా (స్పోర్ట్స్ లేదా గేమ్స్) అభ్యర్థుల సర్టిఫికేట్లను సెప్టెంబర్ 19న పరిశీలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహిస్తున్నారు. ఈ సర్టిఫికేట్ల పరిశీల లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
విజయవాడలో డాక్టర్ ఎన్‌జీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మాట్లాడారు. అభ్యర్థుల ప్రాధాన్యత, పరిశీలన ప్రక్రియ, లోపాల క్రమం జాబితాను యూనివర్శిటీ అధికారిక సైట్‌లో చూడవచ్చన్నారు. ఈ వివరాలను సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం 10 గంటలకు పైన అందుబాటులో ఉంచుతామన్నారు.
రాష్ట్రానికి చెందిన స్పోర్ట్స్ అథారిటీ (శాప్) నేతృత్వంలో ఈ అంశాలను పొందుపరచడం జరుగుతుంది. కాగా, జీవో నెంబరు ప్రకారం అభ్యర్థులు తాము పాల్గొన్న క్రీడలకు సంబంధించిన ధృవీకరణ సర్టిఫికేట్లను తీసుకుని శాప్ వద్ద హాజరుకావలసి ఉంటుందన్నారు.