వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » టాండెమ్‌ను కైవసం చేసుకున్న మణిపాల్ కె-12 (Centrum Advisor | Manipal K-12 Education | acquiring | Tandem)
 
కేరళ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఎడ్యుకేషన్, ప్రిపేరేటరీ సర్వీస్ ప్రొవైడర్స్ సెంటర్స్‌ కలిగిన టాండెమ్‌ను మణిపాల్ కే-12 ఎడ్యుకేషన్ సంస్థ కైవసం చేసుకుంది. ఈ మేరకు ఆ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు టాండెమ్‌ను విలీనం చేసుకున్నట్టు మణిపాల్ కె-12 ఎడ్యుకేషన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా, టాండెమ్ సంస్థకు కేరళలో 39 సెంటర్లు ఉండగా, తమిళనాడు, దుబాయ్‌లలో ఒక్కొక్కటి చొప్పున కేంద్రాలు ఉన్నాయి. పాఠశాల విద్య నుంచి కార్పొరేట్ ట్రైనింగ్ వరకు ప్రిపేరేటరీ సర్వీసెస్‌ విద్యలో టాండెమ్ సంస్థ శిక్షణ ఇస్తోంది. ఈ సంస్థను మణిపాల్ కె-12 చేజిక్కించుకోవడం వల్ల మణిపాల్ సంస్థ దక్షిణ భారతదేశంలో మరింతగా విస్తరించనుంది.

ఈ సంస్థకు ప్రస్తుతం కర్ణాటకలో 30 ఎడురైట్ టుటోరియల్ సెంటర్ల్ ఉండగా, కేరళలో ఆరు ఉన్నాయి. గత 15 సంవత్సరాల మంచి అనుభవం కలిగిన టాండెమ్‌ కేరళలోని మొదటి ఫ్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ కావడం గమనార్హం.

ఈ సంస్థ నుంచి ప్రతి యేడాది 12 వేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ పొందుతున్నారు. ఈ ఒప్పంద వ్యవహారాలకు సంబంధించి సెంట్రమ్ క్యాపిటల్ సోల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోందని ఆ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.